Manifesting Blessings ఆశీర్వాదములు వ్యక్తీకరణ

అబ్రామునకు (అబ్రాహాము) 75 సంవత్సరములు వచ్చినప్పుడు దేవుడు అతనితో మాట్లాడెను మరియు అబ్రాముతో ఒక నిబంధనను ప్రారంభించెను, ఆ నిబంధనే అబ్రహాము నిబంధనగా ప్రాచుర్యము పొందెను (ఆదికాండము 12:1-4). ఈ నిబంధనలో దేవుడు అబ్రామును ఆశీర్వదిస్తానని మరియు ఆయన చూపించు ప్రదేశమునకు తన కుటుంబమును తీసుకొని వెళ్ళిన యెడల తన నామమును గొప్ప చేసెదనని వాగ్ధానము చేసెను. అబ్రాము తన విశ్వాసమునకు చిహ్నంగా తన భార్యయైన శారాయిని, తన సోదరుడైన లోతును మరియు తనకు కలిగిన సమస్తమును తీసుకొని ప్రభువు తనకు ఆజ్ఞాపించిన కానాను దేశములో నివసించుటకు వెళ్ళెను. వారు కానాను దేశమునకు ప్రయాణము చేయుచుండగా దేవుడు తన సంతానానికి ఇచ్చెదనని అబ్రాముతో వాగ్ధానము చేసేను (ఆదికాండము 12:7) తరువాత ఆదికాండము 15వ అధ్యాయములో ఆయనకు దేవుడు దర్శనమందు ప్రత్యక్షమై అబ్రామునకు తన శరీరము నుండి తనకు తనయుడు కలుగునని మరియు తన వారసులు ఆకాశ నక్షత్రముల వలె లెక్కకు ఉందురని దేవుడు తన వాగ్ధానమును విశాలపరచెను. తరువాత తన వారసులకు నైలు నది నుండి యూఫ్రటీసు నది వరకు గల ప్రాంతమును ఇచ్చెదనని దేవుడు వాగ్ధానము చేసెను (ఆదికాండము 15:4-5,18).
ఆదికాండము 16వ అధ్యాయములో శారాయి దేవుని నిబంధన నెరవేరు సమయము రాకముందే ఆ నిబంధన జరిగించుటకు చేసిన ప్రయత్నం మరియు ఇష్మాయేలు జన్మించుట అను కథ కలదు. ఇది తన ప్రపంచములోనికి సమస్యలను తెచ్చెను మరియు నేటికి ఈ ప్రపంచములోనికి కూడ సమస్యలు తెచ్చుచుండెను. ఇష్మాయేలు వారసులు ఇశ్రాయేలుకును మరియు ప్రపంచానికిని కష్టకాలము కలిగించుట ఎన్నటికిని ఆపలేదు. విషాదమేమనగా దేవుని ఆశీర్వాదములు అబ్రాము మీద క్రుమ్మరించడం ప్రారంభం కాకుండానే, దేవుని సమయం కొరకు వేచియుండక పోవడం వలన శారాయి తన యొక్క వాగ్ధానాలలో కొంత కోల్పోవలసి వచ్చింది.
అబ్రాము తనకు 99 సంవత్సరముల వయస్సు వచ్చువరకు తన జీవితములో దేవుని యొక్క నిబంధన ఏర్పాడుట చూడలేదు. ఆదికాండము 17వ అధ్యాయములో దేవుడు అబ్రామునకు ప్రత్యక్షమగుట తన పేరును అబ్రాము నుండి అబ్రాహాముగా మార్చుట మరియు అబ్రాహాము వారసులకు తన నిబంధన ప్రకారము కానాను దేశమును ఇచ్చుట అను వాగ్ధానము నెరవేర్పు మొదలాయెను. 19వ వచనములో అబ్రహాము 100 సంవత్సరముల వయస్సుగల వాడైనప్పుడు తనకు పుట్టబోవు కుమారునికి దేవుడు నామకరణము చేసేను. అబ్రహాము శరీరము నిర్జీవముగా పరిగణింపబడుచున్నప్పటికిని దేవుడు అతనితో అనేక జనములకు తండ్రిగా ఉందువని చెప్పుచున్నాడు. అబ్రహాము బిడ్డలకు తండ్రిగా ఉండలేని దశలో అనేక జనములకు తండ్రిగా ఉండబోవుచున్నాడు. ఒక సాధారణమైన ఆలోచనకు ఇది ఎంతో కష్టతరముగా ఉంటుంది. ఇప్పుడు శారాగా పిలువబడుచున్న శారాయి ఒక మృతమైన గర్భముతో ఉన్నప్పటికిని అనేక జనములకు తల్లిగా ఉండునట్లు వాగ్ధానము పొందినది. తండ్రి కాలేనటువంటి శరీరము కలిగిన అబ్రహాము ఇష్మాయేలు జన్మించిన 13 సంవత్సరముల తరువాత ఒక బిడ్డకు తండ్రి కాబోవుచున్నాడు.
ఎప్పుడైతే దేవుని వాగ్ధానాలు అసాధ్యమైన వాటిని కలుసుకుంటాయో వాటికి జీవం వస్తుంది, అవి వేగవంతం అవుతాయి మరియు అసాధ్యములు సాధ్యములుగా మారుతాయి. ఎప్పుడైతే అబ్రహాము యొక్క విశ్వాసపు విత్తనం శారా యొక్క మృత గర్భమును తాకిందో, అది వేగం పుంజుకొని జీవంలోనికి వచ్చింది! హాల్లెలూయా! మరియు దేవుని వాగ్ధానాలు బయలుపర్చబడినవి. అబ్రాహాము మరియు శారాకు దేవుని వాగ్దానం యొక్క ఫలితం ఇస్సాకు, కాని అతడు తన శరీరము నుండి పుట్టబోవు వారసులకు అంతం మాత్రం కాదు. ఆదికాండము 25వ అధ్యాయములో శారా మరణిస్తుంది. అప్పుడు అబ్రహాము కెతూర అను మరియొక భార్యను చేసుకొంటాడు. అబ్రహాము అనేక జనములకు తండ్రి మరియు మరొక 6 గురు బిడ్డలకు తండ్రిగా నుండెను. ఒక పరిశోధన ప్రకారము ఇస్సాకు రిబ్కాను భార్యగా చేసుకొన్నప్పుడు అతని వయస్సు 40సంవత్సరములు అని తెలిస్తుంది (ఆదికాండము 25:20). అబ్రహాము ఇస్సాకునకు వివాహాము జరుగువరకు కెతూరాను వివాహాము చేసికొనుటకు వేచియుండెను (ఆదికాండము 24:67). దీనిని బట్టి అబ్రహాము కెతూరాను వివాహాము చేసుకొనే సమయానికి మరియు ఆరుగురు బిడ్డలకు తండ్రి అయ్యే సమయానికి అతని వయస్సు 140సంవత్సరములు.
అబ్రహామునకు దేవుడు మొదటిగా వాగ్ధానము చేసినప్పటినుండి అవి నెరవేర్పు జరిగే సమయము వరకు అనేక సంత్సరముల కాలం జరిగిపోయిందని మనందరికీ తెలుసు. ఈ 24 సంవత్సరముల కాలపు వ్యవధిలో అబ్రహాము తన జీవితములో ఈ వాగ్ధానములు నెరవేర్చబడబోతున్నాయని తెలుసుకోకుండానే వేచియుండక అనేక శ్రమలు సహించెను. శారా గర్భవతి అయ్యిన పిదప అబ్రహామునకు తన సమయము వచ్చినదని అర్ధమయినది. ఒకవేళ అబ్రహాము మరియు శారా ఏవిధమైన పరిస్థితులకు తావివ్వక దేవుని కొరకు ఎదురుచూచియుండినట్లయితే వారి జీవితములో శ్రమలనేవి ఎదుర్కొనకపోయేవారేమో. అబ్రహాము మరియు శారా దేవుని వాగ్ధానాలను తామే జరిగించుకోవాలని ప్రయత్నించడం వలన ఏర్పడిన ఫలితాలను ఇస్సాకు వారసులు ఇప్పటికి అనుభవిస్తున్నారు. మనము ఎప్పుడైతే దేవుని వాగ్ధానాలను మనమే చేయాలని ప్రయత్నిస్తామో అప్పుడు మనము అసహనానికి మరియు అవిశ్వాసానికి కలుగు ఫలితాలను అనుభవించవలసివస్తుంది. కాని ఒకవేళ మనము విశ్వాసమందు నిలబడి దేవుని కొరకు ఎదురుచూచినట్లయితే దేవుడు తన మాటపట్ల విశ్వాస్యతను చూపును మరియు మన ఎదురుచూపు ఎంతో అమూల్యముగా ఉండును.
దేవుని ఆశీర్వదములు వాటితోపాటు నిరంతర పరిపూర్ణతను తెస్తాయి. అవి తరతరములకు నిత్యమైన ఆశీర్వదములుగా ఉంటాయి. ఆదికాండము 17:7-9నందు అబ్రహామునకు దేవుడు చేసిన నిబంధన అతనికిని తర్వాత అతని రాబోవు తరములతో కూడా ఉండునని మరియు అది నిత్యమైనదిగా ఉండునని దేవుడు వాగ్ధానము చేసేను. ఇష్మాయేలుకును మరియు ఇస్సాకునకు మధ్య వ్యత్యాసము తరతరాలుగా కొనసాగుతున్న నిత్యమైన ఆశీర్వాదమే. దేవుని చిత్తానికి విరోధముగా చేయు క్రియలన్నియు కేవలం హృదయ వేదనను మరియు అసమ్మతిని కలిగిస్తాయి. ప్రభువు యెడల విశ్వాసము కలిగి ఆయన చిత్తము ప్రకారం ఆయన మార్గములో ఓపికతో ఎదురు చూచు విధేయులైన వారికి ఎంతో సంతోషమును ఆనందమును తెచ్చును. మీరు ఎదురుచూచున్న సమయములో కూడా దేవుడు మీకు భద్రత, ఆదరణ, పరిపూర్ణత మరియు గొప్ప బహుమానము ఇచ్చును.
ఆదికాండము 15వ అధ్యాయములో ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో నీ నుండి అనేక తరములు వచ్చును అని చెప్పెనో అబ్రహాము ప్రభువును నమ్మెను మరియు దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసమును తనకు నీతిగా ఎంచెను. దేవుడు అబ్రహాము వాగ్ధానానికి ఇస్సాకు అని నామకరణం చేసెను, హెబ్రీ భాషలో దానికి అర్ధము “అతడు నవ్వును”. వాగ్ధానము నుండియే గొప్ప సంతోషమును మరియు నవ్వును వచ్చును. ఇస్సాకు అబ్రహాము యొక్క గొప్ప సంతోషము మరియు ఇస్సాకు తన తండ్రికి చెప్పశక్యము కాని ఆనందమును గొప్ప నవ్వును తెచ్చెనని నేను భావిస్తున్నాను.
జానీ హాలెండ్, అను నాకు దేవుడు ఒక నిబంధనను ఇచ్చెను:
1997 డిసెంబర్ లో ప్రభువు యొక్క వాక్యము నా యొద్దకు వచ్చి చెప్పినదేమనగా,
నేను నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబుల దేవుడను. నేనే నీకు జన్మనిచ్చాను మరియు నిన్ను పెంచి పోషించాను. ఈ దినమున నేను నీతో ఒక నిబంధనలో ప్రవేశించుచున్నాను. నీవు ఎన్నటికిని ఒక ఉద్యోగానికి, ఒక చర్చికి గాని, ఒక సహావాసమునకు గానీ, మరి ఏ మానవునికి గానీ పనివానిగానుండకూడదు. నాకు కేవలం నాకు మాత్రమే సేవ చేయవలెను. నీ శేషజీవితమంతయు నేను నిన్ను సంరక్షించెదను. నీకు అవసరమైన ప్రతిదానిని నేను నీకు దయ చేసేదను. కేవలం నాకు సేవ చేయడానికే నీవు నిర్ణయించుకో.
30 మే 2000రోజున దేవుడు నాకు బ్లెస్ మినిస్ట్రీస్ మొబైల్, USA కొరకు నన్ను నియమించెను:
బ్లెస్ మినిస్ట్రీస్ వ్యక్తిగత పరిచర్య నైపుణ్యత మరియు తలాంతులను అభివృద్ధి చేస్తూ, వ్యక్తుల మరియు పరిచర్యలతో సహకరించడానికి, ప్రభువగు దేవునిచే నియమింపబడినది. ప్రజలు మరియు పరిచర్యలు, యేసు క్రీస్తులో వారు కలిగిన పిలుపు లక్ష్యాలను చేరుటలో మా అనుభవము, సామర్ధ్యము మరియు వనరులతో సహకారం అందించడమే మా పాత్రయైయున్నది. మేము పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా నడిపింపబడుతూ దేవుని ఆశీర్వాదములు మీ జీవితములో మరియు మీ పరిచర్యలో వ్యక్తపరచబడుటకు మేము సహాయపడతాము.
అప్పటినుండి దేవుని చిత్తప్రకారము మేము ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిచర్యలకు ఆర్ధిక పంపిణీ చేయువిధముగా, ప్రభువు అనేక గొప్ప మరియు అద్భుతమైన వాగ్దానాలు బ్లెస్ మినిస్ట్రీస్ పైన క్రుమ్మరిస్తున్నాడు. ఈ ఆర్థిక విధానాలను ఎలా పంపిణీ చేయాలి మరియు ప్రపంచవ్యాప్తంగా భాగస్వాములను ఎలా తయారు చేయాలో అనేదాని గురించి నాకు ఆయన చాలా బోధించియుండెను. అబ్రాహాము దేవుడు తనకు ఇచ్చిన వాగ్ధానము వ్యక్తపరచబడుట చూచుటకు ముందు ఇరవై నాలుగు సంవత్సరాలు పట్టింది. ప్రభువు నాతో చేసిన నిబంధనకై పంతొమ్మిది సంవత్సరముల ఆరు నెలలు నుండి ఎదురుచూస్తూన్నాను.
-ప్రతులకు సంప్రదించండి
బిషప్. జి.డి. మిలాంగ్టన్ బాబు
ద షీఫ్ అండ్ గ్రేస్ మినిస్ట్రీస్
మలకపల్లి – 534 345,
పశ్చిమగోదావరి – జిల్లా
ఆంధ్రప్రదేశ్. ఇండియా